Bethamcherla: బేతంచర్ల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత: రీకౌంటింగ్‌పై రగడ

Bethamcherla: బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వద్ద రీకౌంటింగ్ నిర్ణయంతో ఉద్రిక్తత నెలకొంది. కమిషనర్‌పై వైసీపీ ఆందోళనకు దిగగా ఎస్పీ సునీల్ షేరాన్ చెదరగొట్టారు.

Ramanaiah, Banaganepalle
Published on: 3 Nov 2026 4:29 PM IST
Bethamcherla
X

Bethamcherla: బేతంచర్ల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత: రీకౌంటింగ్‌పై రగడ

నంద్యాల జిల్లా: బేతంచర్ల లో ఎన్నికల కేంద్రం కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత, బేతంచెర్ల నగర పంచాయతీ కి మొత్తం 28 వార్డులు. వైసీపీ 19. టీడీపీకి 9. వార్డుల అధిక్యత. రాజకీయ ఒత్తిళ్లకు తల్లోగ్గి రీకౌంటింగ్ పెట్టారంటు మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎజంట్లు. అభ్యర్థులు.

కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగిన ఏజెంట్లు. మరియు అభ్యర్థులు. రికౌంటింగ్ ఆపాలని కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసనకు దిగి మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ ఆందోళనకు దిగిన వైసిపి శ్రేణులు భారీగా మోహరించిన పోలీసులు.

ఆధిక్యంలో ఉన్న వైసిపి 9 వార్డులను రీకౌంటింగ్ పెట్టడం ఏంటి అని బూతులు మార్చడానికే అధికారులు పోలీసులు కుంభకయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్న వైసిపి కార్యకర్తలు.వార్డ్ మెంబర్లు.

బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్, రంగంలోకి దిగి వైసిపి కార్యకర్తలను చెదరగొట్టిన జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle