Nandyal: నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి 7 నామినేషన్లు దాఖలు!
Nandyal: నంద్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు చైర్మన్ పదవికి 7, వార్డులకు 154 నామినేషన్లు దాఖలయ్యాయి.
Nandyal: నంద్యాల మున్సిపల్ చైర్మన్ పదవికి 7 నామినేషన్లు దాఖలు!
Nandyal: నంద్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజు అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవికి మొత్తం ఏడు నామినేషన్లు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వెల్లడించారు. ఇక 52 వార్డులకు రెండో రోజు 154 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. చివరి రోజు అభ్యర్థులు గడువులోగా నామినేషన్లు సమర్పించాలని స్పష్టం చేశారు.
నంద్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాజకీయ సందడి నెలకొంది. మొదటి రోజు మున్సిపల్ చైర్మన్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. రెండో రోజు మాత్రం వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
చైర్మన్ పదవికి టీడీపీ నుంచి రెండు, వైఎస్సార్సీపీ నుంచి రెండు, ఇండిపెండెంట్ల నుంచి రెండు, ఇతరుల నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వెల్లడించారు.
ఇక 52 వార్డులకు రెండో రోజు మొత్తం 154 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. వీటిలో టీడీపీ నుంచి 52, వైఎస్సార్సీపీ నుంచి 70, బీజేపీ నుంచి నాలుగు, కాంగ్రెస్ నుంచి ఒకటి, జనసేన నుంచి ఒకటి, ఇతరుల నుంచి ఏడు నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లో కలిపి మొత్తం 166 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు.
మరోవైపు 13, 18, 20, 22వ వార్డులకు రెండో రోజు కూడా అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదని కమిషనర్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా తమ నామినేషన్లు సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత ఒక్క సెకను ఆలస్యమైనా నామినేషన్లు స్వీకరించేందుకు అనుమతి ఉండదని మున్సిపల్ కమిషనర్ శేషన్న స్పష్టం చేశారు.




