Markapur: మార్కాపురం ఏకలవ్య పాఠశాలలో గెస్ట్ టీచర్ల పోస్టులకు దరఖాస్తులు!

Markapur: మార్కాపురం పెద్ద దోర్నాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో గెస్ట్ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. చివరి తేదీ అక్టోబర్ 3.

Srikanth Singam, Markapur
Published on: 26 Sept 2026 2:29 PM IST
Markapur
X

Markapur: మార్కాపురం ఏకలవ్య పాఠశాలలో గెస్ట్ టీచర్ల పోస్టులకు దరఖాస్తులు!

Markapur: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల లోని ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి గెస్ట్ టీచర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పిన్నపాటి గార్లపాటి తెలిపారు.

PGT–జీవశాస్త్రం ఒకటి, TGT–కంప్యూటర్ సైన్స్ ఒకటి, కౌన్సిలర్ ఒకటి (మహిళ), పార్ట్‌టైం డాక్టర్ ఒక పోస్టు చొప్పున భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను 03-10-2026లోపు సమర్పించాలని సూచించారు.

PGT పోస్టుకు సంబంధిత విభాగంలో పీజీతో పాటు బీఈడీ, TET/CTET ఉత్తీర్ణత ఉండాలి. TGT పోస్టుకు సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు బీఈడీ, TET/CTET ఉత్తీర్ణత అవసరం. పార్ట్‌టైం డాక్టర్ పోస్టుకు MBBS అర్హత ఉండాలి. మరిన్ని వివరాలకు 9441622761 నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ ఈశ్వర్ సింగ్ భరద్వాజ్ తెలియజేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur