Srisailam: శ్రీశైలంలో వైభవంగా దసరా వేడుకలు మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి!
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
Srisailam: శ్రీశైలంలో వైభవంగా దసరా వేడుకలు మహాగౌరి అలంకారంలో భ్రమరాంబికాదేవి!
Srisailam: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎనిమిదోవరోజు శ్రీభ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.
శ్రీ భ్రమరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు,కేరళ చండి మేళం, కొమ్ము కోయ నృత్యం,రాజ బటుల వేషాలు,విళక్క( సాంప్రదాయ నృత్యం) చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా గ్రామోత్సవం కదలివస్తున్న శ్రీస్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు దంపతులు,ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు,భక్తులు పాల్గొన్నారు.




