Giddalur: 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ ముబీన జోరుగా ప్రచారం!

Giddalur: గిద్దలూరు 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ ముబీన ప్రచారం ముమ్మరం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 28 Oct 2026 4:40 PM IST
Giddalur
X

Giddalur: 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి షేక్ ముబీన జోరుగా ప్రచారం!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డు టిడిపి కౌన్సిలర్ షేక్ ముబీన తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో వార్డులోని వీధివీధినా తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు.

వార్డులోని వీధుల్లో అభ్యర్థి కూటమి నాయకులతో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, మహిళల ఆశీస్సులు తీసుకున్నారు.

వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చిన తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని సమస్యను వీలైనంత త్వరగా తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, స్థానిక నాయకులు జనార్దన్, లతీఫ్ ఖాన్, షూకూర్, సాజిద్ ఖాన్, షారుక్ ఖాన్, షేక్.జిలానీ పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU