Giddalur: ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీలో తీవ్ర మంచినీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 22 Sept 2026 12:24 PM IST
Giddalur
X

Giddalur: ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Giddalur: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో గత నెల నుండి తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది, ఎల్ నినో ప్రభావంతో గిద్దలూరు ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి దీనితో గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోవడం, వాగులు వంకలు ఎండిపోవడంతో గిద్దలూరు పట్టనంలో మంచినీటికి, వాడుక నీటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

గత వారం రోజులుగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో స్వయంగా పర్యటించి , పర్యవేక్షించి వారికి ప్రతి మూడు రోజులకు ఒకసారి ప్రతి నాలుగు ఇండ్లకు ఒక ట్యాంకర్ ద్వారా నీటిని అందించే ఏర్పాటు చేశారు.

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నిత్యం నీటిని అందించాలంటే రోజుకు సుమారు 1300 ట్యాంకర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేసి ప్రణాళిక బద్ధంగా 50 ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ఒక్కో టాంకరు 8 ట్రిప్పుల ప్రకారం రోజుకు సుమారు 400 ట్యాంకర్లను నీటి ఎద్దడి ఉన్న ప్రాంత ప్రజలకు అందించేలాగా ఏర్పాటు చేసి ఈరోజు మంచినీటి సరఫరా ట్యాంకర్లను ప్రారంభించారు.

వర్షాభావ పరిస్థితులు ఉండటం వల్ల ప్రజలు గమనించి ప్రతి ఒక్కరు తమ వంతుగా నీటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU