Kurnool: కర్నూలు జెడ్పీ చైర్‌పర్సన్‌గా గీతా కుమారి యాదవ్? టీడీపీ అధిష్టానం పరిశీలన!

Kurnool: కర్నూలు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని తుగ్గలి జెడ్పీటీసీ గీతా కుమారి యాదవ్‌కు ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు మద్దతు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 11 Nov 2026 7:20 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జెడ్పీ చైర్‌పర్సన్‌గా గీతా కుమారి యాదవ్? టీడీపీ అధిష్టానం పరిశీలన!

Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో తుగ్గలి మండల జడ్పీటీసి గా గెలిచిన గీతా కుమారి యాదవ్ ను జడ్పీ చైర్మెన్ గా అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం ఆలోచనలో ఉంది. జిల్లా లో అన్ని బిసి వర్గాలకు సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు యాదవ వర్గానికి కూడా ఉన్నత స్థానం కల్పించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.

ఎమ్మెల్యే కె. ఈ. శ్యాం బాబు అందరి ఎమ్మెల్యే ల సహకారం తో జడ్పీ పీఠం కైవసం చేసుకునేలా అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. యాదవ సామాజిక వర్గానికి జిల్లాలో ఎమ్మెల్యే కాని ఎంపి కాని ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అన్ని బిసి వర్గాలకు జడ్పీ చైర్మెన్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ సారి యాదవ వర్గానికి ఇవ్వాలని అధిష్టానం ఆలోచనలో ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని జడ్పీటీసీ గీతా కుమారి యాదవ్ టీడీపీ నాయకులు వెంకటేష్ యాదవ్ లు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL