Emmiganur: ఎమ్మిగనూరులో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు!

Emmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

S Khaleel, Yemmiganur
Published on: 2 Oct 2026 9:41 AM IST
Emmiganur
X

Emmiganur: ఎమ్మిగనూరులో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు!

Emmiganur: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహం, సత్యం, శాంతి మార్గాల్లో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారని కొనియాడారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బిల్లే హల్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి గిరి, ప్రతాప్ రంగయ్య శెట్టి, ప్రతాప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur