Kurnool: గాజులదిన్నెలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

Kurnool: గాజులదిన్నెలో రూ.1.40 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం. పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Sept 2026 5:35 PM IST
Kurnool
X

Kurnool: గాజులదిన్నెలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

కర్నూలు: గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.. గోనెగండ్ల మండలం గాజులదిన్నె గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిధులు 1 కోటి 40 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎం.ఎల్.ఏ బీ.వీ జయ నాగేశ్వర రెడ్ది తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఎంపీ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లెలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు.. వీటి తో పాటు పల్లె పండుగ 3.0 తో గ్రామాల్లో అభివృద్ధికి కొత్త ఊపిరిని పోస్తూ సీ.సీ రోడ్లు, డ్రైనేజి పనులకు శ్రీకారం చూడుతున్నామని తెలిపారు.

ఇక ప్రజలకు మంచి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ తోడుగా ఉండాలన్న ఎంపీ, రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో గ్రామం టీడీపీ నాయకుడు, మాజీ ఎం.పీ.పీ హనుమంతు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL