Kurnool: కరువు మండలాల ఎంపికపై అధికారుల తీరుపై తిక్కారెడ్డి తీవ్ర ఆగ్రహం!

Kurnool: కరువు మండలాల ఎంపికపై అధికారుల తీరుపై టీడీపీ నేత తిక్కారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రాలయం, ఎమ్మిగనూరులను కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

S Khaleel, Yemmiganur
Published on: 11 Oct 2026 10:07 PM IST
Kurnool
X

Kurnool: కరువు మండలాల ఎంపికపై అధికారుల తీరుపై తిక్కారెడ్డి తీవ్ర ఆగ్రహం!

కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జిల్లాలో కరువు మండలాల ఎంపిక...అధికారుల తీరు పై.. తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు,వలసలకు పెట్టింది పేరు మంత్రాలయం,ఎమ్మిగనూరు నియోజకవర్గాలని అయినా అధికారుల కళ్ళకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కష్టాలను కొందరు అధికారులు అభాసు పాలు చేస్తున్నారన్నారు. ఎల్యేల్సి లో సాగునీరు లేదు..వర్షాలు రాలేదు,తుంగభద్ర నదిలో నీరు లేదు అయినా ఒక్క మండలం కరువు మండలం ఎంపిక కాకపోవడం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు.

రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.వైసీపీ కి అధికారులు వజ్రాయుధం ఇచ్చారని... ఈ విషయాన్ని హైకండ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.అధికారులు లంచాలు కు తప్ప దేనికి పనికి రారని,రాష్ట్రంలో ఏసీబీ అధికారులు కాంప్రమైజ్ అయ్యారన్నారు.

తెలంగాణ లో పెద్ద చేపలను ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారని...ఏపీలో ఏసీబీ అధికారులు చిరు చేపలను పట్టుకుంటున్నారని. తిక్కారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur