Kalluru: కల్లూరులో ఘనంగా చిన్నారి దేవాన్ష్ జన్మదిన వేడుకలు!
Kalluru: కర్నూలు జిల్లా కల్లూరులో వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ సెక్రటరీ చెంచు వెంకటస్వామి మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకల్లో నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి.
Kalluru: కల్లూరులో ఘనంగా చిన్నారి దేవాన్ష్ జన్మదిన వేడుకలు!
Kalluru: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ సెక్రటరీ చెంచు వెంకటస్వామి గారి మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకలు కల్లూరులో వారి నివాసం నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారి దేవాన్ష్‌ను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చిన్నారి దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎదగాలని కాటసాని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు అర్బన్ 33వ వార్డు మాజీ కార్పొరేటర్ మైతపు నరసింహులు, 32వ వార్డు మాజీ కార్పొరేటర్ సాన శ్రీనివాసులు, 28వ వార్డు మాజీ కార్పొరేటర్ నారాయణరెడ్డి, రంగప్ప, వీరేంద్ర కుమార్, సుధాకర్ రెడ్డి, భాస్కర్, కేశవ రెడ్డి, వెంకటేశ్వర్లు, సంపతి సుబ్బారెడ్డి, వెంకటస్వామి కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




