Atmakuru: వేడెక్కిన ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం!

Atmakuru: నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ చైర్మన్ శివపురం నూర్ మహమ్మద్ కుటుంబం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరింది.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 27 Sept 2026 4:26 PM IST
Atmakuru
X

Atmakuru: వేడెక్కిన ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల రాజకీయం!

Atmakuru: శ్రీశైలం నియోజకవర్గం పాలన కేంద్రం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ఎన్నికల్లో తలపడేందుకు ఆశావహులు పార్టీల్లో చేరే ప్రక్రియకు తెర లేపారు. తాజాగా గతంలో వైఎస్ఆర్సిపి నుంచి మున్సిపల్ చైర్మన్ గా పాలన సాగించిన మాజీ చైర్మన్ కుటుంబంతో పాటు ఆయన అల్లుడు 200 కుటుంబాలతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరికలతో మునిసిపల్ ఎన్నికల వాతావరణం నంద్యాల జిల్లాలో ఆత్మకూరులోనే ప్రారంభమైందని చెప్పవచ్చు.

కూటమి ప్రభుత్వం అతి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధపడి గత రెండున్నర ఇళ్లలో చేసిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది.

దీంతో నంద్యాల జిల్లా మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సీపీకి చెందిన మాజీ చైర్మన్ శివపురం నూర్ మొహమ్మద్, ఆయన అల్లుడు మన్సూర్ వలి 200 కుటుంబాలతో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

గత రెండున్నర సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ చైర్మన్, ఆయన కుటుంబ సభ్యులు వివరించారు. ఇదిలా రేపటి ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి మాజీ చైర్మన్ శివపురం నూర్ మహమ్మద్ అల్లుడు మన్సూర్ వలి చైర్మన్ అభ్యర్థిగా తెదేపా నుంచి బరిలోకి దిగే ఆశావహులుగా రంగంలోకి దిగారు. ఈ మున్సిపాలిటీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)