Alur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: వైకుంఠం జ్యోతి

Alur: కర్నూలు జిల్లా ఆలూరు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై అధికారులతో టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి సమీక్ష నిర్వహించారు.

Bheemalinga, Aluru
Published on: 1 Oct 2026 7:55 PM IST
Alur
X

Alur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: వైకుంఠం జ్యోతి

కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి, డ్వామా పీడీ నరసింహారెడ్డితో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌, విద్య, రెవెన్యూ, పంచాయతీ, డ్వామా, సచివాలయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు శాఖల వారీగా సమన్వయంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, రీ-సర్వే, విద్యా దీవెన, పింఛన్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

చిన్న సమస్యే అయినా.. ప్రజలకు అది పెద్ద సమస్య కావచ్చు అనే దృక్పథంతో అధికారులు పనిచేయాలని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని తెలిపారు. ముఖ్యంగా కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు ఫోన్‌ ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా శాఖల మధ్య సమన్వయం పెంచుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆమె కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివరాలను వెల్లడించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru