Devanakonda: దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని రైతుల రాస్తారోకో!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు బళ్లారి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

G Jagadeesh, Pathikonda
Published on: 5 Oct 2026 3:02 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని రైతుల రాస్తారోకో!

Devanakonda: దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దేవనకొండ టర్నింగ్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆందోళనకు సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

రైతుల ధర్నాతో కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda