Emmiganur: రూ.31 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనుల ప్రారంభం

Emmiganur: ఎమ్మిగనూరులో రూ.31 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి. పట్టణంలో సీసీ రోడ్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం.

S Khaleel, Yemmiganur
Published on: 22 Sept 2026 4:55 PM IST
Emmiganur
X

Emmiganur: రూ.31 కోట్ల హెచ్‌ఏఎం అభివృద్ధి పనుల ప్రారంభం

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో HAM పథకం తో చేపట్టే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం ద్వారా 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, సీఎం ప్రారంభించారని ఇందులో భాగంగా ఎమ్మిగనూరు పట్టణములో 31 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి అన్నారు.

పట్టణంలో సిసి రోడ్లు,పార్క్ ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి పనులు చేపతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.అభివృద్ధి టీడీపీ తోనే సాధ్యమని ఇప్పటి వరకు పట్టణంలో జరిగిన అభివృద్ధి పై సోమప్ప కూడలిలో చర్చకు సిద్ధమని ప్రత్యర్థులకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur