Markapuram: కొర్రప్రోలులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం!

Markapuram: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం జిల్లా కొర్రప్రోలులో ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం. ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 17 Sept 2026 11:09 AM IST
Markapuram
X

Markapuram: కొర్రప్రోలులో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం!

Markapuram: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దోర్నాల మండలం కొర్రప్రోలు గ్రామంలో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, లీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ శిబిరాన్ని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పేదలు, గిరిజనులకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి మీడియా సెల్ అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM