Kurnool: కోడుమూరు అయ్యప్ప స్వామి ఆలయ దాత డాక్టర్ రఘరామి రెడ్డి సన్మానం!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ దాత, స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు గ్రహీత డాక్టర్ రఘరామి రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
Kurnool: కోడుమూరు అయ్యప్ప స్వామి ఆలయ దాత డాక్టర్ రఘరామి రెడ్డి సన్మానం!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి చెందిన ధర్మపురి శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి దాతగా సేవలందించిన డాక్టర్ రఘరామి రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
డాక్టర్ రఘరామి రెడ్డి నివాసానికి వెళ్లిన కోడుమూరు ధర్మపురి శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై నిర్వహించిన పరిశీలనలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు లభించింది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డాక్టర్ రఘరామి రెడ్డి అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ రఘరామి రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రజా సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయ నిర్మాణానికి ఆయన అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నలుబోలు విజయభాస్కర్ రెడ్డి, జీతూరి రవికుమార్, పులుమామిడి వెంకటేశ్వర్లు, మాదుగుండు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.




