Pedda Dornala: తూర్పు బొమ్మలాపురంలో దారుణం: వృద్ధురాలిని తగలబెట్టిన మనవడు

Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో మద్యానికి బానిసైన రాము అనే యువకుడు తన బామ్మ లక్ష్మమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు.

Srikanth Singam, Markapur
Updated on: 26 Sept 2026 6:34 PM IST
Pedda Dornala
X

Pedda Dornala: తూర్పు బొమ్మలాపురంలో దారుణం: వృద్ధురాలిని తగలబెట్టిన మనవడు

మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మండలం తూర్పు బొమ్మలాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పసుపులేటి లక్ష్మమ్మ (81) అనే వృద్ధురాలిపై ఆమె మనవడు రాము పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిపోయిన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాము చెడు వ్యసనాలకు బానిసై, మద్యం మత్తులో వృద్ధురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను చెరిపివేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధురాలు ఉపయోగించే మంచాన్ని, కాలిపోయిన బట్టలను సమీపంలోని పాడుబడ్డ బావిలో పడేసినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న ఎర్రగొండపాలెం సీఐ కె. అజయ్ కుమార్, పెద్ద దోర్నాల ఎస్సై జె. నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur