Pathikonda: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన నార్మల్ డెలివరీ!
Pathikonda: కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన. 4.6 కేజీల బరువున్న భారీ శిశువుకు ఎలాంటి సిజేరియన్ లేకుండా నార్మల్ డెలివరీ చేసిన డాక్టర్ కల్పన.
Pathikonda: పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన నార్మల్ డెలివరీ!
Pathikonda: కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. సాధారణంగా అధిక బరువున్న బిడ్డలకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కానీ పత్తికొండలో 4.6 కేజీల బరువున్న బాబుకు నార్మల్ డెలివరీ చేసి వైద్యురాలు కల్పన ఔరా అనిపించారు.ఆస్పరి మండలం జోహారపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి పురిటి నొప్పులతో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
పరీక్షించిన వైద్యులు బిడ్డ బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయినా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నార్మల్ డెలివరీ చేశారు. పుట్టిన బాబు బరువు 4.6 కేజీలు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.సాధారణంగా 3.5 కేజీల లోపు బరువుంటే నార్మల్ డెలివరీ సులభం అవుతుంది.
4 కేజీలు దాటితే సిజేరియన్ తప్పదని వైద్యులు చెబుతారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కల్పన రిస్క్ తీసుకుని సక్సెస్ అయ్యారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కేసు విజయవంతం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ కల్పన ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలు ఖర్చు అయ్యే ఈ డెలివరీని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా, సురక్షితంగా చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.




