Nandyal: నంద్యాల కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల జేఏసీ భారీ ధర్నా!

Nandyal: నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల సాయం అందించాలని డిమాండ్.

R Pavankalyan, Nandyal
Published on: 21 Sept 2026 2:44 PM IST
Nandyal
X

Nandyal: నంద్యాల కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల జేఏసీ భారీ ధర్నా!

Nandyal: నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు ఆందోళన చేపట్టారు.

మంచానికే పరిమితమైన దివ్యాంగులకు నెలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

ప్రతి దివ్యాంగ కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని, 35 కిలోల బియ్యంతో అంత్యోదయ రేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగుల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వ ఉచిత రుణాలు మంజూరు చేయాలని కోరారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని కోరుతూ దివ్యాంగుల జేఏసీ నాయకులు, సభ్యులు నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగించారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal