Devanakonda: మండల అభివృద్ధే లక్ష్యం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి!

Devanakonda: దేవనకొండ జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తెర్నేకల్ మధుసూదన్ రెడ్డి ప్రచారం. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శ.

Bheemalinga, Aluru
Published on: 26 Oct 2026 6:16 PM IST
Devanakonda
X

Devanakonda: మండల అభివృద్ధే లక్ష్యం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి!

దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి తెర్నేకల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. దేవనకొండ మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి, 45 సంవత్సరాలు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు కూడా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు.

మరోవైపు దేవనకొండ మండలంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించినప్పటికీ, మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై ఆయన ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని, కరువు పరిస్థితులను గుర్తించి తగిన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

దేవనకొండ మండల ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్యలు మండల అభివృద్ధి బాటలో నడిపిస్తా అన్ని తెలిపిన వైస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి...

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru