Devanakonda: జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన తెర్నేకల్ వెంకప్ప!

Devanakonda: దేవనకొండ మండలంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి సుశీలమ్మ గెలుపు కోసం తెర్నేకల్ వెంకప్ప ఇంటింటి ప్రచారం. కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన జనసేన ఇన్‌చార్జ్.

G Jagadeesh, Pathikonda
Published on: 28 Oct 2026 10:10 PM IST
Devanakonda
X

Devanakonda: జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిన తెర్నేకల్ వెంకప్ప!

దేవనకొండ: దేవనకొండ మండలంలో జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సుశీలమ్మ కు మద్దతుగా నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి తెర్నేకల్ వెంకప్ప పాల్గొని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

గాజు గ్లాస్ గుర్తుతో బరిలో ఉన్న మొదటి ఎంపీటీసీ అభ్యర్థి సుశీలమ్మ కు మద్దతుగా ప్రజలను కలుస్తూ, అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రచారంలో వెంకప్ప అన్న పాల్గొనడం జనసేన నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నాయకుడు అంటే కేవలం ముందుండి నడిపించేవారే కాదు… కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చి, వారి కష్టంలో తోడుగా నిలిచి, విజయమే లక్ష్యంగా ముందుకు నడిపించేవారని మరోసారి నిరూపించారు.

తెర్నేకల్ వెంకప్ప రాకతో జనసేన శ్రేణుల్లో జోష్ పెరిగింది… ఆయన మాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది… ఆయన ఇచ్చిన భరోసాతో నాయకులు, కార్యకర్తలు మరింత పట్టుదలతో ముందుకు సాగుతున్నారు!

నాయకుడి ప్రోత్సాహం… కార్యకర్తల కష్టం… ప్రజల ఆదరణ… ఇవే విజయానికి బలమైన పునాదులు

జనసేన పార్టీ అభ్యర్థి సుశీలమ్మ గెలుపు కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల మద్దతు కోరాలని ఈ ప్రచారం స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం ఉచిరప్ప, సరోజిని, హబీబా, అరుణ, నాగరాజు, పరమేష్,రమేష్, తేజ, సహదేవ, బ్రహ్మయ్య.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda