Devanakonda: అరగంట వర్షానికే ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధం!

Devanakonda: దేవనకొండ మండలంలో అరగంట వర్షానికే ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి పరిసరాల్లో నిలిచిన నీరు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

G Jagadeesh, Pathikonda
Published on: 24 Oct 2026 12:34 PM IST
Devanakonda
X

Devanakonda: అరగంట వర్షానికే ప్రభుత్వ కార్యాలయాలు జలదిగ్బంధం!

Devanakonda: మండలంలో అరగంట పాటు కురిసిన వర్షానికే ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు నీటితో నిండిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, పాఠశాలలు, ఆసుపత్రి, బ్యాంకు, వెటర్నరీ ఆసుపత్రి తదితర కీలక ప్రాంతాల వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల పక్కనే ఆసుపత్రి ఉండటంతో, చికిత్స కోసం వచ్చే రోగులు, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునే వారి పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ఈ పరిస్థితి ఉంటే, భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

“ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ డ్రైనేజీ ఉందా? లేక డ్రైనేజీ చుట్టూనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయా?” అంటూ ప్రజలు అధికారుల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలే అపరిశుభ్రంగా, మురుగునీరు నిలిచే ప్రాంతాలుగా మారితే గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను ఎలా మెరుగుపరుస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నిలిచిన నీటిని తొలగించి, డ్రైనేజీలను శుభ్రం చేయాలని అధికారులను కోరుతున్నారు.

కార్యాలయాల పరిసరాలనే శుభ్రంగా ఉంచలేకపోతే.. ఊరంతా పారిశుద్ధ్యాన్ని ఎలా కాపాడతారు? ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda