Devanakonda: దేవనకొండలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు నేడే గడువు

Devanakonda: దేవనకొండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు నేడే ఆఖరు గడువు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాలని సీఐ ధనుంజయ సూచన.

G Jagadeesh, Pathikonda
Published on: 23 Oct 2026 9:24 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు నేడే గడువు

దేవనకొండ: దేవనకొండ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు తమ నామినేషన్లను దాఖలు చేసుకోవాలని దేవనకొండ సీఐ ధనుంజయ తెలిపారు.

ఇంకా ఎవరైనా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటే, గడువులోగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

నామినేషన్ దాఖలు చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా తమకు తెలిసినట్లయితే సమాచారం అందించాలని, అవసరమైన సహకారం అందిస్తూ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా దగ్గరుండి సహకరిస్తానని సీఐ ధనుంజయ పేర్కొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda