Devanakonda: సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
Devanakonda: దేవనకొండలో పల్లె పండగ 3.0 కింద మూడు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Devanakonda: సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ
దేవనకొండ: దేవనకొండ గ్రామం లో మూడు కాలనీలో సీసీ రోడ్లకు భూమిపూజ దేవనకొండ: ఆలూరు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప ఆదేశాల మేరకు దేవనకొండలో ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా దేవనకొండ గ్రామం లోని కాలనీలో మూడు సిసి రోడ్లు జనసేన ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
దేవనకొండ పట్టణంలోని ఎస్సీ కాలనీలో జనసేన ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, డిప్యూటీ ఎంపీడీఓ గోపాల్, పంచాయతీ కార్యదర్శి శంకరమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బంగి పాపన్న ఇంటి నుంచి మాదిగ ప్రభుదాస్ ఇంటి వరకు, ఆర్మీ రామాంజనేయులు ప్లాట్ నుంచి కొలిమి బ్రాహ్మయ్య ఇంటి వరకు, గుళ్లం మునిష్ ఇంటి నుంచి సిలివెరీ శ్రీరాములు ఇంటి వరకు మూడు రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
కాలనీలో రహదారుల నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని కూటమి నాయకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పల్లె పండగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగుడు, డైరెక్టర్ బోయ సరోజ, మాజీ జడ్పీటీసీ ఉచిరప్ప, ఆకుల వీరేష్, సురేంద్ర నాయుడు, జనసేన నాయకులు ఏ. ఉచిరప్ప, బుసల రామాంజినేయులు, బంగి చంటిబాబు, బాలు, తిప్పన్న, రమేష్, పరమేష్, బ్రహ్మయ్య, బీజేపీ నాయకులు జంగం వీరయ్యతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.




