Devanakonda: దేవనకొండలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధిక జోరుగా ప్రచారం!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధిక ఎన్నికల ప్రచారం. అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు హామీ.
Devanakonda: దేవనకొండలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధిక జోరుగా ప్రచారం!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధికకు మద్దతుగా కుంకునూరు, కొత్తపేట, పొట్లపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు.
ఈ ప్రచారంలో టీడీపీ సీనియర్ నాయకుడు సుభాన్, మాజీ సర్పంచ్ బడిగింజల రంగన్న తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ సాధిక మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులను పార్టీ గుర్తించడం సంతోషకరమని అన్నారు. తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైకుంఠం జ్యోతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..
దేవనకొండ మండల ప్రజలు తనను జడ్పీటీసీగా గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం, రహదారులను మెరుగుపరచడం, ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడటం తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ దేవనకొండ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని డాక్టర్ సాధిక పేర్కొన్నారు.




