Kurnool: బనవాసి ఫారంలో హైస్కూల్, కాలేజీ, వసతిగృహం ఏర్పాటు చేయాలి
Kurnool: ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో 15 గ్రామాల విద్యార్థుల సౌకర్యార్థం హైస్కూల్, కాలేజీ, హాస్టల్ ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్‌ను కోరారు.
Kurnool: బనవాసి ఫారంలో హైస్కూల్, కాలేజీ, వసతిగృహం ఏర్పాటు చేయాలి
కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలో దాదాపు 3500 ప్రభుత్వ భూమి కలదు అందులో ప్రభుత్వం అనేక కార్యాలయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయనుంది అయితే ఫారం చుట్టు పక్కన 15గ్రామాలు కలవు ఆయా గ్రామాలలో హై స్కూల్స్ లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఎమ్మిగనూరుకు వెల్లిరావాల్సిన పరిస్థితి ఉంది అయితే గ్రామాలకు సమయానికి బస్సులు లేక విద్యార్థులు మద్య లోనే చదువుకు దూరమవుతున్నారు.
చుట్టు పక్కల గ్రామాలైన బనవాసి, ఫారం, పరమాన్ దొడ్డి, నక్కలమిట్ట, బోడబండ,చెన్నా పురం, దేవిబెట్ట, కోటేకల్, మల్కపురం, బసాపురం గ్రామాలు తో పాటు పెద్దకడుబూరు మండలం రాగిమాన్ దొడ్డి, గంగుల పాడు గ్రామాల విద్యార్థులు ఎమ్మిగనూరు కు వెళ్ళి చదువుతున్నారు .ఇక్కడే కాలేజీ, హైస్కూల్, హాస్టల్ ఎర్పాటు జిల్లా కలెక్టర్ ,డిఈఓ ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులు కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము.




