Nandyal: శ్రీశైల మహాక్షేత్రంలో శాస్త్రోక్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు!
Nandyal: శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన దసరా నవరాత్రి మహోత్సవాలు. అక్టోబర్ 20 వరకు ఉత్సవాలు, తొలిరోజే క్షేత్రానికి భక్తుల పోటెత్తు.
Nandyal: శ్రీశైల మహాక్షేత్రంలో శాస్త్రోక్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు!
Nandyal: శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి యాగశాలలో అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు దసర నవరాత్రి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు పది రోజులపాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబరు 20తేదీతో ముగియనున్నాయని ఈఓ శ్రీనివాసరావు చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు.
సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో ప్రతిరోజు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషపూజలు, శ్రీ అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీహోమం, రుద్రహోమం, జపములు, పారాయణలు జరుపబడుతాయి అయితే ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు సంప్రదాయబద్దంగా పసుపు,కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేయడం జరిగింది.
లోకకల్యాణం కోసం నిర్వహించబడే ఈ ఉత్సవ సంకల్పంలో అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలములో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండి, సుఖశాంతులు విలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పూజలు నిర్వహించారు. మొదటి రోజు శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సఖల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈఓ చైర్మన్ వెల్లడించారు.




