Kurnool: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ కోయ ప్రవీణ్

Kurnool: కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి శనివారం ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Sept 2026 7:29 PM IST
Kurnool
X

Kurnool: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: డీఐజీ కోయ ప్రవీణ్

కర్నూలు : ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపియస్ గారు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారులు ఆదేశాలు జారీ చేశారు.

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.

ఈ సంధర్బంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత , ట్రాఫిక్ నిబంధనల పై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు.

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా , ఓవర్ స్పీడ్ , ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతల పై ప్రజలకు అవగాహన కల్పించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL