Kurnool: ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రి టీజీ భరత్‌కు విజ్ఞప్తి!
Kurnool: కర్నూలు నగరంలోని అమీర్ హైదర్ ఖాన్ నగర్ పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా.
Kurnool: ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రి టీజీ భరత్‌కు విజ్ఞప్తి!
Kurnool: నగరంలో అమీర్ హైదర్ ఖాన్ నగర్ కొట్టాలకు పట్టాలు ఇవ్వాలని అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ బాషా అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మలమ్మ నగర కార్యదర్శిలు ఎం రాజశేఖర్, టి రాముడు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నప్పటికీ పట్టాలు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు.
ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో మాకు ఓట్లు వేసి గెలిపిస్తే మీకు (పట్టణ ప్రాంతాలలో) రెండు సెంట్లు స్థలంమిచ్చి ఇల్లు నిర్మించుకోవడం కోసం డబ్బులు మంజూరు చేస్తామని అదేవిధంగా జీవో నెంబర్ 30 ప్రకారం ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీలు ఇచ్చారని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల అయినప్పటికీ ఇప్పటికీ అమీర్ హైదర్ ఖాన్ నగర్ కాలనీ ప్రజలకు పట్టాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ అధికారులు అది వక్ఫ్ బోర్డు స్థలం కావడం వల్ల మేము పట్టాలు ఇవ్వలేము అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని వక్ఫ్ బోర్డు భూములను రియాల్టర్లు లేఅవుట్ వేసి యదేచ్చగా అమ్ముతున్న పట్టించుకోవడంలేదని పేదవాడి వరకు వచ్చేసరికి అన్ని ఆటంకాలు చెబుతున్నారని ప్రభుత్వ అధికారులు గానీ కూటమి ప్రభుత్వ మంత్రులు గానీ ప్రభుత్వం నుండి వక్ఫ్ స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడితే సాయంత్రమే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమల శాఖ మాత్యులు టీజీ భరత్ ఎలాగైనా మీకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మంగళగిరి ప్రాంతంలో పట్టాల పంపిణీ కార్యక్రమం కూటమి ప్రభుత్వం రేపు పెద్ద ఎత్తున చేపట్టిందని అలాగే ఇక్కడ కూడా అనేక ప్రాంతాలలో ( షెడ్రక్ నగర్, బుధవారం పేట హంద్రీ కోటాలు తిలక్ నగర్ అమీర్ హైదర్ ఖాన్ నగర్ ) పట్టాలిచ్చి మంత్రి టీజీ భరత్ గారు ప్రజల యొక్క ఆధార అభిమానాలు,
ప్రశంశలు పొందాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఆలోపే నగరంలోని పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు అసెంబ్లీ షరీఫ్ కే రామకృష్ణ అబ్దుల్ దేశాయి స్థానిక నాయకులు నాగేంద్ర, రియాజ్ ,బి లక్ష్మీదేవి, సరిత, లక్ష్మి, ఇస్మాయిల్, చేపల శీను, చంద్ర, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.




