Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక!
Markapur: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్!
Markapur: మార్కాపురం కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక!
Markapur: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్ఓ శ్రీదేవి, ఆర్డీఓ వెంకట శివరామి రెడ్డి తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ వివాదాలు, రెవెన్యూ, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యల బట్టి సంబంధిత శాఖల అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ సునీత జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు.




