Yerragondapalem: కోలాహలంగా యర్రగొండపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
Yerragondapalem: మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కంచర్ల సత్యనారాయణ గౌడ్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
Yerragondapalem: కోలాహలంగా యర్రగొండపాలెం కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్!
మార్కాపురం జిల్లా: యర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన కంచర్ల సత్యనారాయణ గౌడ్ నామినేషన్ కార్యక్రమం కోలాహలంగా సాగింది. టీడీపీ కార్యాలయం నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు.
అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తల సందడి మధ్య కంచర్ల సత్యనారాయణ గౌడ్ ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో నామినేషన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.




