Markapuram: మార్కాపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడి!
Markapuram: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కున్నంపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి.
Markapuram: మార్కాపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర దాడి!
Markapuram: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం కున్నంపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి వివాదం తీవ్ర రూపం దాల్చింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లతో దాడులకు దిగారు. రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున రాళ్లు విసురుకోవడంతో ఇరువర్గాలకు చెందిన ఐదుగురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘర్షణ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కున్నంపల్లి గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
గ్రామంలో మరోసారి ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




