Guduru: ఎమ్మెల్యే దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన గూడూరు చైర్‌పర్సన్!
Guduru: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా విజయం సాధించిన సునీతాబాయి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Guduru: ఎమ్మెల్యే దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపిన గూడూరు చైర్‌పర్సన్!
Guduru: కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిని గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్ సునీతాబాయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా తన గెలుపునకు సహకరించి, విజయం సాధించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తన విజయానికి అందించిన సహకారం, ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నాయకులతో ఆత్మీయంగా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు.




