Pagidyala: వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు అన్యాయం!
Pagidyala: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరెస్టులపై అధికార టీడీపీపై మండిపడ్డారు.
Pagidyala: వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు, అరెస్టులు అన్యాయం!
Pagidyala: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
మా నాయకులు ఎక్కడున్నారో చెప్పకుండా పోలీసులు దాచిపెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు.
గత ఐదేళ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ అభివృద్ధి అంతా ఆగిపోయిందని విమర్శించారు.
ప్రజల సమస్యలు గాలికి వదిలేసి, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ తాము చెయ్యాల్సినవన్నీ పూర్తి చేసి మమ్మల్ని కావాలనే పోలీసులను అడ్డుపెట్టుకుని నిర్బంధిస్తున్నారని అన్నారు.
మొన్న నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు ప్రతీకారంగానే ఈ రోజు మా మండల నాయకులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగోలిపే చర్యలకు టీడీపీ నాయకులు పాలుపడుతున్నారని మండిపడ్డారు.
మేము ఎవరికీ భయపడం, ప్రజల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనికి రేపు అసలుకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని అధికార పార్టీ నేతలను, కొందరు అధికారులను ఉద్దేశించి హెచ్చరించారు.
త్వరలో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని, ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి .
పోలీసుల అదుపులో ఉన్న మా నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తామని ఆయన డిమాండ్ చేశారు.




