Nandikotkur: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. 23, 24 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు.
Nandikotkur: ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి!
Nandikotkur: నంద్యాల జిల్లా నందికోట్కూరు పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ,నియోజకవర్గ సమన్వయకర్త డా"సుదీర్ దారా నందికోట్కూరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 23,24 వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించారు.
నందికోట్కూరు పురపాలక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థిని షేక్ ఫాతిమాబీ మరియు 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతా శశికళను ,24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రహుఫ్ లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని, నందికోట్కూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు.




