Nandikotkur: నందికొట్కూరు 19వ వార్డులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జోరుగా ప్రచారం!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు 19వ వార్డు వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి బొగ్గుల భాగ్యలక్ష్మికి మద్దతుగా మాజీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 25 Oct 2026 10:42 AM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు 19వ వార్డులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జోరుగా ప్రచారం!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 19వ వార్డు వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొగ్గుల భాగ్యలక్ష్మి మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తో తన ప్రచారాన్ని మమ్మరం చేశారు.. తన వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఆదివారం 19వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ముఖ్యంగా వీరి ప్రచారంలో యువకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం.గతంలో తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదని,సూపర్ సిక్స్ హామీల పేరుతో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని,తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రతి ఒక్కరిని కోరిన 19వ వార్డు అభ్యర్థిని బొగ్గుల భాగ్యలక్ష్మి.

తనకు విజయం చేకూరితే వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం, తాగునీటి సమస్యను పరిష్కరించడం, రహదారులను మెరుగుపరచడం, పారిశుధ్య నిర్వహణను పటిష్టం చేయడం, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు.

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే సంకల్పంతో వస్తున్న , మీలో ఒకరిగా,మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి, ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, 19వ వార్డు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వటం తో పాటు,మీ ప్రతి ఓటు మన వార్డు భవిష్యత్తుకు ఎంతో విలువైనదన్నారు.

వీరి కుమారుడు బి. సూర్య రెడ్డి వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం,ఇతనికి స్థానిక వార్డులో మహిళలు ,యువకుల మద్దతు ఉండటం వీరికి కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)