Nandanapalle: గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. నన్ను ఆశీర్వదించండి: అబ్దుల్ మజీద్!
Nandanapalle: కర్నూలు జిల్లా నందనపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి షేక్ అబ్దుల్ మజీద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి మద్దతు కోరారు.
Nandanapalle: గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. నన్ను ఆశీర్వదించండి: అబ్దుల్ మజీద్!
కర్నూలు: కర్నూలు జిల్లాలోని నందనపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మిలిటరీ కాలనీకి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మిలిటరీ కాలనీతో పాటు మైనార్టీ వర్గాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలు, పెద్దలను ఆయన కోరారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా వందలాది మంది గ్రామ ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ.. నందనపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో నందనపల్లె,వెంకాయపల్లె,భూపాల్ నగర్, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్ అనే ఐదు గ్రామాలు ఉన్నాయని తెలిపారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదు గ్రామాల సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా ఐదు గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
మిలిటరీ కాలనీకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా గ్రామ పెద్దలు, ప్రజలు తనకు ఒక అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా గెలిపించాలని అబ్దుల్ మజీద్ విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలిపిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




