Kurnool: కర్నూలు 44వ వార్డులో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బి. రమాదేవి జోరుగా ప్రచారం!

Kurnool: కర్నూలు కార్పొరేషన్ 44వ వార్డు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బి. రమాదేవి విస్తృత ప్రచారం నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 25 Oct 2026 9:03 AM IST
Kurnool
X

Kurnool: కర్నూలు 44వ వార్డులో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బి. రమాదేవి జోరుగా ప్రచారం!

Kurnool: కర్నూలు కార్పొరేషన్ 44వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి బి రమాదేవిని, కర్నూలు కార్పొరేషన్ మేయర్గా పోటీ చేస్తున్న బోల్లెద్దుల ప్రత్యూషను గెలిపించాలని బిజెపి మద్దిలేటి యాదవ్ 44వ వార్డు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 44వ వార్డు కల్లూరులో కార్పొరేటర్ అభ్యర్థి బి రమాదేవితోపాటు కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ అభ్యర్థి బి రమాదేవి మాట్లాడుతూ పాత కల్లూరులోనే నివాసం ఉన్న తాము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. గత కొన్నేళ్లుగా కాలనీ ప్రజలకు సుపరిచితులుగా తమ కుటుంబం ఉంది అన్నారు. కూటమి తరపున తనకు కార్పొరేటర్ సీటు కేటాయించిన ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి యాదవ్ మాట్లాడుతూ కర్నూలు నగరా ఆభివృద్ధిలో మాజీ రాజ్యసభసభ్యుడు టీ జీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పారు. అలాగే కర్నూలు కార్పొరేషన్ లో మేయర్ అభ్యర్థి బోల్లెద్దుల ప్రత్యూష సైకిల్ గుర్తుపై 44వ వార్డు కార్పొరేటర్ బి రమాదేవి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

బిజెపి నాయకులు గూడూరు లక్ష్మీదేవి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి అనేకమార్గాల ద్వారా నిధులను కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదే తరహాలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు గా ముందుకు సాగుతుందని తెలిపారు.

కర్నూల్ నగరంలో కూడా కూటమి అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మేయర్ పీఠాన్ని కూడా అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ ఇంజార్టీ పవన్ కుమార్, అలిపిర క్రిస్టఫర్ బిజెపి నాయకులు మీసాల గంగాధర్ తారకేశ్వర్ రెడ్డి విశ్వనాథ్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL