Kurnool: స్థానిక సంస్థల ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ: భూమన!
Kurnool: కర్నూలులో వైకాపా రీజినల్ కో-ఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వెల్లడి.
Kurnool: స్థానిక సంస్థల ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ: భూమన!
Kurnool: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ అభ్యర్థులు కరువయ్యారు , ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఇప్పుడు జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటి చేసేందుకు వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పోరేషన్ లో బలంగా ఉంది.
రాష్ట్రంలో చంద్రబాబు దాస్టిక పరిపాలనా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రభుత్వ, పోలీస్ యంత్రాంగం అంతా కూటమి ప్రభుత్వానికి పక్షాన నిలబడి వేధింపులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ బెదిరింపులకు వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరు. బిసిలకు న్యాయ చేస్తామని బాబు మోసం చేశారు. బిసిలకు 34 రిజర్వేషన్ పేరుతో వెన్నుపోటు పోడిచారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 55 శాతం పైగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించారు.
బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద పీట వేశాం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వారం రోజుల ముందే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు సిటీ ను జనరల్ సిటిగా మార్చారు. కర్నూలు, నంద్యాల తోపాటు 175 నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పోటి చేస్తుంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు పార్టీ ఓడిపోతే మూడు సంవత్సరాల తరువాత చంద్రబాబు బయటకు వచ్చారు.
కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా పనిచేస్తుంది.
కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యలు చేసిన అక్రమ కేసులు నమోదు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు తొనకడం లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మోసం చేసిన విషయాలను ప్రజలను చైతన్య చేసి ప్రచారం చేస్తాం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 3 లక్షల కోట్ల రూపాయలతో నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం.
గ్రామ స్థాయి నుండి పోటి చేసే ఏజెంట్ గా జిల్లా అధ్యక్షుడు పెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పోటి చేస్తుంది. చంద్రబాబు కుట్రలపై పోరాటం చేస్తాం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలంగా పోటీ చేస్తాం. పోటీ చేసే అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యం గా ఇచ్చే అధికారులపై న్యాయ పోరాటం చేస్తాం.




