Bethamcherla: బేతంచర్లలో అక్రమ ఐరన్‌ ఓర్‌ తవ్వకాలపై దాడులు

Bethamcherla: బేతంచర్లలో అక్రమ ఐరన్‌ ఓర్‌ తవ్వకాలపై అధికారుల దాడులు. 710 టన్నుల ఐరన్‌ ఓర్‌తో పాటు జేసీబీ, టిప్పర్లు, ఇటాచి వాహనాలు సీజ్.

Bharat Raj, Dhone
Published on: 28 Sept 2026 11:27 PM IST
Bethamcherla
X

Bethamcherla: బేతంచర్లలో అక్రమ ఐరన్‌ ఓర్‌ తవ్వకాలపై దాడులు

బేతంచర్ల: నంద్యాల జిల్లా బేతంచర్ల మండలంలోని గూటుపల్లె ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న ఐరన్‌ ఓర్‌ తవ్వకాలపై మైనింగ్‌, విజిలెన్స్‌ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు.

సర్వే నంబర్‌ 612లో తవ్వకాలు, సర్వే నంబర్‌ 628లో ఐరన్‌ ఓర్‌ డంపింగ్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో సుమారు 710 టన్నుల ఐరన్‌ ఓర్‌ను సీజ్‌ చేశారు.

అలాగే అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక జేసీబీ, రెండు టిప్పర్లు, ఒక ఇటాచి, ఒక క్యాంపర్‌ వాహనాన్ని అధికారులు సీజ్‌ చేశారు.

అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone