Banaganapalle: నవ వధువులకు పెళ్లి కానుకల పంపిణీ.. మాజీ సర్పంచ్!

Banaganapalle: బనగానపల్లె నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా నవ వధువులకు ఉచితంగా పెళ్లి కానుకలు అందజేస్తున్న అరుణ భారతి సాహితి సంస్థ అధ్యక్షులు బీసీ రాజారెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 1 Oct 2026 4:17 PM IST
Banaganapalle
X

Banaganapalle: నవ వధువులకు పెళ్లి కానుకల పంపిణీ.. మాజీ సర్పంచ్!

Banaganapalle: బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన నవ వధువుల కోసం ఉచితంగా పెళ్లి కానుక పంపిణీ చేస్తున్నట్లు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్, అరుణ భారతి సాహితి సంస్థ అధ్యక్షులు బిసి రాజారెడ్డి తెలిపారు. ఈమేరకు గురువారం బనగానపల్లె మండలం మీరాపురంగ్రామానికి చెందిన ముల్లా కీ.శే. షేక్ మస్తాన్ షా , మాబ్బి దంపతుల కుమార్తె, ముల్లా బాబా ఫక్రుద్దీన్ ఫకృబి దంపతుల కుమార్తెల వివాహం సందర్భంగా వారికి పెళ్లి కానుకలను అందజేశారు.

ఈసందర్బంగా బిసి రాజారెడ్డి మాట్లాడుతూ... తన తల్లిదండ్రులు కీ.శే. బిసి గుర్రెడ్డి, బిసి లక్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం నియోజకవర్గం లోని ఆయా గ్రామాల్లో వివాహం చేసుకోబోయే నూతన వధువులకు ఉచితంగా పెళ్లి కానుక అందజేయడం జరుగుతుందన్నారు. 2022 నుంచి ఈ పెళ్లి కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి ఏటా వందల మంది నవ వధువులకు పెళ్లి కానుకలు అందజేస్తున్నామన్నారు.

పెళ్లి కానుకలో రూ.4 వేలు విలువ చేసే ప్రముఖ రేమాండ్, అరవింద్ కంపెనీలకు చెందిన పెళ్లి కుమారుడి సర్ట్, పాయింటు, పెళ్లి కుమార్తెకు ధర్మవరం చీరె ఉంటాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఈ పెళ్లి కానుక అందజేస్తున్నట్లు బిసి రాజారెడ్డి తెలిపారు. వధువు తరఫున పెళ్లి కార్డు తీసుకొని వచ్చి తనను సంప్రదిస్తే వారికి పెళ్ళికానుకను అందజేస్తామన్నారు. నియోజకవర్గంలోని బనగానపల్లె, కోవెలకుంట్ల , సంజామల, కొలిమిగుండ్ల , అవుకు మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిసి రాజా రెడ్డి గారు కోరారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle