Banganapalle: బనగానపల్లెలో ఈ-ఆటోలను ప్రారంభించిన మంత్రి జనార్దన్ రెడ్డి!

Banganapalle: బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర! పంచాయతీ కార్మికులకు ఈ-ఆటోలను ప్రారంభించి అందజేసిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle
Published on: 19 Sept 2026 11:52 AM IST
Banganapalle
X

Banganapalle: బనగానపల్లెలో ఈ-ఆటోలను ప్రారంభించిన మంత్రి జనార్దన్ రెడ్డి!

Banganapalle: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంతో బనగానపల్లె నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆరోగ్యకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, ఐ&ఐ శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలను ప్రారంభించి పంచాయతీ కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సుస్థిర భవిష్యత్తు కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ఈ-ఆటోల అందుబాటుతో గ్రామాలు, పట్టణాల్లో చెత్త సేకరణ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని, తద్వారా పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

పచ్చని పర్యావరణం – పరిశుభ్రమైన సమాజం – సమృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మన అందరి సంకల్పమని తెలిపారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తూ అభివృద్ధి, సమృద్ధి వైపు బనగానపల్లె నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle