Banganapalle: బనగానపల్లెలో ఈనెల 16న గ్రాండ్ సాంస్కృతిక, మ్యాజిక్ షో!

Banganapalle: బనగానపల్లెలో ఈనెల 16న శ్రీ అరుణ భారతి సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక, మ్యాజిక్ షో. చిన్నారెడ్డి డ్యాన్స్, మాస్టర్ శంకర్ ఇంద్రజాలం ప్రత్యేక ఆకర్షణ.

Ramanaiah, Banaganepalle
Published on: 14 Oct 2026 6:36 PM IST
Banganapalle
X

Banganapalle: బనగానపల్లెలో ఈనెల 16న గ్రాండ్ సాంస్కృతిక, మ్యాజిక్ షో!

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో ఈనెల 16వ తేదీన శ్రీ అరుణ భారతి సాంస్కృత సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక మరియు మెజీషియన్ కార్యక్రమం. నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు, బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి మీడియా కు తెలిపారు.

బనగానపల్లె బిసి గుర్రెడ్డి కాలనీలోని ప్రియదర్శి స్కూల్ ఎదురుగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక మరియు ఇంద్రజాలం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కడపకు చెందిన గోల్డ్ మెడలిస్ట్ డాన్స్ మాస్టర్ డి.చిన్నారెడ్డి నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు.

శ్రీ సాయి నటరాజ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జానపద నృత్యములు, మహిషాసుర మర్దిని, కూచిపూడి నృత్యాలు, వెస్టన్ డ్యాన్సులు, లంబాడి నృత్యములు ఉంటాయన్నారు.

మాస్టర్ శంకర్ గారి ఆధ్వర్యంలో మెజీషియన్ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అరుణ భారతి సాంస్కృతిక సంస్థ సభ్యులు బలరామయ్య , జ్యోతిష్యం వెంకటరాముడు,భరతుడు, బచ్చు భాస్కరయ్య, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle