Banaganapalle: బనగానపల్లెలో అనారోగ్య బాధితులకు బీసీ ఇందిరారెడ్డి పింఛన్లు

Banaganapalle: బనగానపల్లెలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 8 మంది నిరుపేదలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి సొంత నిధులతో నెలవారీ పింఛన్లు అందజేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 6 Oct 2026 7:02 PM IST
Banaganapalle
X

Banaganapalle: బనగానపల్లెలో అనారోగ్య బాధితులకు బీసీ ఇందిరారెడ్డి పింఛన్లు

నంద్యాల జిల్లా: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి సొంత నిధులతో నెలవారీ పెన్షన్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బనగానపల్లెలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న 8 మందికి నెలవారీ పెన్షన్‌ను పంపిణీ చేశారు.

ప్రతి నెలా ఏడుగురికి రూ.3 వేల చొప్పున, ఒకరికి రూ.2 వేల చొప్పున ఇందిరారెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కైపా గ్రామానికి చెందిన ముగ్గురు, సంకలాపురానికి చెందిన ఇద్దరు, చెరువుపల్లెకు చెందిన ఇద్దరు, కొలిమిగుండ్లకు చెందిన ఒకరికి ఈ పెన్షన్ అందుతోంది.

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈ ఆర్థిక సహాయం కొంత మేరకు తోడ్పాటుగా ఉంటుందని బీసీ ఇందిరారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తన వంతు సహాయం నిరంతరం అందిస్తానని బీసీ ఇందిరారెడ్డి అన్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle