Banaganapalle: నీట్ పీజీ ర్యాంకర్ సాయి అనిలకు బీసీ ఇందిరా రెడ్డి అభినందనలు

Banaganapalle: నీట్ పీజీలో నంద్యాల జిల్లా ఫస్ట్ సాధించిన సాయి అనిలను అభినందించిన బీసీ ఇందిరా రెడ్డి. ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని సూచన.

Ramanaiah, Banaganepalle
Published on: 29 Sept 2026 6:21 PM IST
Banaganapalle
X

Banaganapalle: నీట్ పీజీ ర్యాంకర్ సాయి అనిలకు బీసీ ఇందిరా రెడ్డి అభినందనలు

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని పెండేకంటి నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నేట్ల రామమోహన్ రెడ్డి కుమార్తె సాయి అనిల జాతీయ స్థాయి నీట్‌ (పీజీ) పరీక్షలో ప్రతిభ కనబరిచారు. మొత్తం 720 మార్కులకు గాను 560 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 1537వ ర్యాంక్‌తో పాటు నంద్యాల జిల్లాలో ప్రథమ ర్యాంక్‌ సాధించారు.

సాయి అనిల సాధించిన విజయాన్ని తెలుసుకున్న బీసీ ఇందిరా రెడ్డి ఆమెను, ఆమె తల్లిదండ్రులను బనగానపల్లెలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు

ఈ సందర్భంగా సాయి అనిలను శాలువా కప్పి సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆమె ఆకాంక్షించారు.

స్వగ్రామమైన నందవరంలో భవిష్యత్తులో ప్రతి నెలా ఒక రోజు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని సాయి అనిలకు బీసీ ఇందిరా రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle