Kurnool: కర్నూలులో బాల్య వివాహాలు బాలల హక్కులపై అవగాహన సదస్సు!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు.. పాల్గొన్న జిల్లా బాలల సంరక్షణ అధికారులు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Sept 2026 5:43 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో బాల్య వివాహాలు బాలల హక్కులపై అవగాహన సదస్సు!

Kurnool: కర్నూలు బి.క్యాంప్‌లోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. సిరి గారి ఆదేశాల మేరకు బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు మరియు బాలల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా బాలల సంరక్షణ అధికారి టి. శారద, కౌన్సిలర్ టి. నాగేష్ రావు, సోషల్ వర్కర్ ఎన్. నరసింహులు, లీగల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ డి. సుంకన్న పాల్గొని విద్యార్థులకు బాల్య వివాహాల నిరోధక చట్టం–2006, బాలల హక్కులు, బాలల సంరక్షణ మరియు బాలల రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

బాల్య వివాహాల వల్ల బాలల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే ప్రభావాలను వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధి మరియు గౌరవంగా జీవించే హక్కు ఉందని వివరించారు.

అదేవిధంగా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసినా, బాలలపై వేధింపులు, హింస లేదా ఇతర సమస్యలు ఎదురైనా వెంటనే 1098కు సమాచారం అందించి సహాయం పొందవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారుల పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించే విధంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ప్రాధాన్యతను కూడా వివరించారు. చిన్నారులకు పండ్లు, అరటి పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడంతో పాటు, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ ఆరోగ్యం, విద్య మరియు భవిష్యత్తుపై ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురారి శంకరయ్య, మెల్విన్ జోన్స్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్, సుధీర్‌ప్రసాద్ (భారత్ వికాస్ పరిషత్) తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నాయకులు త్రినాథ్ కుమార్, తిరుపతి సాయి, నటరాజ్, బి.ఎ. శ్రీనివాసరావు, శ్రీమతి ఎలిజబెత్ తదితరులు పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.

బాలల భవిష్యత్తు కోసం విద్య, ఆరోగ్యం, రక్షణ అనే మూడు అంశాలకు సమాజం ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ బాలల హక్కులను గౌరవిస్తూ వారి అభివృద్ధికి సహకరించాలని కార్యక్రమంలో సూచించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డా. ఎస్. నాగస్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సభ్యులు మల్లికార్జున, విజయశేఖర్, లక్ష్మి, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ పాల్గొన్నారు. విద్యార్థులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కులు, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అవగాహన పొందారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL