Atmakur: ఆత్మకూరులో పటిష్ట భద్రత నడుమ MPTC నామినేషన్లు!
Atmakur: ఆత్మకూరులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ పటిష్ట బందోబస్తుతో సాగుతోంది. ఎస్సై జంపానీ కుమార్ నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
Atmakur: ఆత్మకూరులో పటిష్ట భద్రత నడుమ MPTC నామినేషన్లు!
Atmakur: పూర్తి బందోబస్తుతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎంపీటీసీ ఎన్నికల పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆత్మకూర్ ఎస్సై జంపానీ కుమార్ తెలిపారు. తమ స్టేషన్ సిబ్బందితోపాటు అదనంగా ఎన్నికల కోసం వచ్చిన సిబ్బందితో కలిసి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని ఎస్సై తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా తమపై అధికారుల సూచనలతో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు.
నామినేషన్లు దాఖలా చేసేందుకు వచ్చే అభ్యర్థుల వివరాలను తెలుసుకొని వారిని క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ కేంద్రానికి అనుమతి ఇస్తున్నారు.. అభ్యర్థితోపాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తూ పూర్తి పర్యవేక్షణ చేస్తున్నామని ఎస్సై జంపాని కుమార్ తెలిపారు..




