Atmakur: ఫోన్‌లో బెదిరింపులు, బూతు పురాణం: డీఎస్పీపై యువకుడి ఆవేదన

Atmakur: ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ తనను చంపుతానని బెదిరించారని, బూతులతో దూషించారని ఆరోపిస్తూ బాధితుడు సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.

M Satya Peter, Atmakur (Karnool)
Updated on: 28 Sept 2026 9:14 PM IST
Atmakur
X

Atmakur: ఫోన్‌లో బెదిరింపులు, బూతు పురాణం: డీఎస్పీపై యువకుడి ఆవేదన

ఆత్మకూరు: ఆయన అతిపెద్ద బాధ్యత గల ఓ పోలీస్ అధికారి.. 24 గంటలు శాంతి భద్రతలను కాపాడుతూ.. పర్యవేక్షిస్తూ .. ఉండాల్సిన ఆ డి.ఎస్.పి అతి భయంకరమైన బూతు పురాణంతో ఓ యువకుడిపై విరుచుకుపడ్డాడు.

మీ ఊరికి వచ్చి కత్తితో పొడిచి చంపుతాను అన్నాడు. నాతోనే పెట్టుకుంటావా .. మీ ఇంట్లో వాళ్లందర్నీ లేపేస్తా .. అన్నాడు.. అంతటితో ఆగక 60 సంవత్సరాల ఆ యువకుడి వృద్ధ తల్లిని సభ్య సమాజం తలదించుకునేలా .. యావత్ మహిళా ప్రపంచం సిగ్గుపడేలా బూతుల దండకం వెళ్లవేశాడు.

దీంతో బాదిత యువకుడు తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోం మంత్రికి నేరుగా ఫిర్యాదు చేశాడు. ఇంతకు ఆ డి.ఎస్.పి ఎవరు? బూతు పురాణ దండకం ఏమిటో చూద్దామా?

ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమలలో ఎన్నో సంచలనాల రికార్డులను సొంతం చేసుకోండి.

ఇక్కడ ఏది జరిగిన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తాయి. ఇప్పుడు కూడా మరో సంచలనం వైరల్ గా మారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి కి ఫిర్యాదులు వెళ్లాయి.

ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్, ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్ఐ ఈ ముగ్గురు కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన బాధితుడు శ్రీనివాసాచారికి సంబంధించిన ఓ కేసులో శ్రీనివాసాచారి కుటుంబానికి అన్యాయం చేస్తూ, నేరపూరిత కుట్ర, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ, శాస్త్రీయ ఆధారాలను అదృశ్యం చేశారని ఆరోపిస్తూ బాధితుడి భార్య శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేసింది.

దీనిపై స్పందించిన అథారిటీ కేసు న్యాయస్థానం పరిధిలో ఇంకా విచారణలో ఉన్నందున ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ పదోన్నతిని నిలిపివేయాలని, ప్రభుత్వ హోం శాఖ ద్వారా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డిజిపి ని ఆదేశించింది.

ఈ ఉత్తర్వులు ఆత్మకూరు డివిజన్లో వైరల్ అయ్యాయి. ఉత్తర్వుల కాపీలను కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామానికి చెందిన సగినాల సురేష్ ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ కు పంపించారు.

దీంతో డిఎస్పి రామాంజి నాయక్ సగినాల సురేష్ ను ఫోన్లో బండ బూతులు తిడుతూ .. తిట్ల పురాణం మొదలుపెట్టాడు. రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉత్తర్వులు బెదిరించాడు. నీ గ్రామానికి వచ్చి కత్తితో పొడిచి చంపి నీ అంత చూస్తానని అతి భయంకరంగా బూతులు వల్లే వేశాడు ఆత్మకూరు డిఎస్పి.

అందరితో ఊరుకున్నాడా అంటే 60 ఏళ్ల వృద్ధురాలైన సగినాల సురేష్ తల్లిని సభ్య సమాజం సిగ్గుపడేలా .. యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునేలా బూతులతో రెచ్చిపోయాడు.

పోలీస్ శాఖ ఉత్తర్వులకు ఎలాంటి సంబంధం లేకున్నా తనని చంపుతానని, తన కుటుంబాన్ని మొత్తం అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించకపోతే తన పేరు రామాంజి నాయకే కాదని హెచ్చరించడానికి బాధితుడు తన వాంగ్మూలంతో ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు.

ఆత్మకూరు డిఎస్పి నుంచి తనకు ప్రాణహాని ఉందని అతనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితుడు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనపై ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీరం దాస్ స్పందించారు. ఆత్మకూరు డిఎస్పి ని సస్పెండ్ చేసి సుమోటాగా కేసు విచారణ జరపాలని ఈ సంఘటనపై హైకోర్టులో వాదిస్తానని ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

ఏదిఏమైనా ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ ఓ కేసు విషయంలో దళిత యువకుడిని చంపుతానని బెదిరించిన విషయం పెను దుమారం రేపుతుంది

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)