Kurnool: కర్నూలు జిల్లాలో ఉత్సాహంగా అంగన్‌వాడీ ఉత్సవ కార్యక్రమాలు!
Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్టు ములుగుందంలో పోషణ్ మాసం, అంగన్‌వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించి నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు.
Kurnool: కర్నూలు జిల్లాలో ఉత్సాహంగా అంగన్‌వాడీ ఉత్సవ కార్యక్రమాలు!
Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరి ప్రాజెక్టు పరిధిలో బిలేకల్ సెక్టర్ పరిధిలో ములుగుందం గ్రామం నందు పోషణ మా, మరియు అంగన్‌వాడీ ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతులకు,అందుతున్న సేవలు మరియు చిన్నారుల ఎదుగుదల పర్యవేక్షణ, పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ మరియు తల్లీబిడ్డల సంక్షేమంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగం గా మాత్రలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మావతి అంగన్‌వాడీ కార్యకర్తలు , సహాయకులు, వైద్య సిబ్బంది,తల్లులు పాల్గొన్నారు.




